అన్న సెంచరీ చేయగానే తమ్ముడు ఉప్పొంగిపోయాడు...బ్యాటు వదిలేసి కౌగిలించుకున్నాడు!

  • భారీ షాట్ తో సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్
  • 80 పరుగులు చేసిన ఇర్ఫాన్ పఠాన్
  • అన్న సెంచరీ చేయగానే సంతోషంతో ఉప్పొంగిన ఇర్ఫాన్ పఠాన్
రంజీ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒక ఎండ్ లో సిక్సర్  తో అన్న సెంచరీ చేయగానే, మరో ఎండ్ లో ఉన్న తమ్ముడు బ్యాటు వదిలేసి సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా ఇండోర్‌ లో మధ్యప్రదేశ్‌-బరోడా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బరోడా ఆటగాడు యూసుఫ్‌ పఠాన్‌ భారీ షాట్ తో సిక్సర్ కొట్టి సెంచరీ సాధించాడు. దీంతో మరో ఎండ్‌ ఉన్న ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆనందంపట్టలేకపోయాడు. వెంటనే సంతోషంతో బ్యాట్‌ వదిలేసి వెళ్లి సోదరుడిని ఆలింగనం చేసుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. మధ్యప్రదేశ్ తన ఇన్నింగ్స్ ను 551 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్ లో 302, రెండో ఇన్నింగ్స్ లో 318 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో యూసుఫ్ 111 పరుగులు చేయగా, ఇర్ఫాన్ 80 పరుగులు చేశాడు. అయినప్పటికీ 8 వికెట్ల తేడాతో బరోడా పరాజయం పాలైంది. 
Go Back to Shorts
ranji
yusuf pathan
irfan pathan
baroda
mp
cricket

More Telugu News